![]() |
![]() |

ఇటీవల గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్ దగ్గర జాలీగా చెట్టాపట్టాలేసుకొని కెమెరాకు పోజులిచ్చిన టెన్నిస్ స్టార్ లియాండ్ పేస్, 'ఖడ్గం' ఫేమ్ కిమ్ శర్మ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో ఆ ఇద్దరూ చాలా సన్నిహితంగా, ఒకరి సాంగత్యాన్ని మరొకరు బాగా ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు. ఆ ఫొటోలతో కిమ్-పేస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే అభిప్రాయం అనేకమందిలో కలిగింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పలువురు నెటిజన్లు చర్చించుకున్నారు.
గతంలో కిమ్ 'అవును' యాక్టర్ హర్షవర్ధన్ రాణేతో ప్రేమలో పడింది. ఆ ఇద్దరూ జంటగా కలిసి తిరిగారు. లేటెస్ట్‌గా కిమ్-పేస్ వైరల్ ఫొటోలపై హర్షవర్ధన్ స్పందించాడు. వాళ్లిద్దరూ హాటెస్ట్ కపుల్ ఇన్ టౌన్‌గా కనిపిస్తున్నారనీ, అయితే వాళ్ల రిలేషన్‌షిప్ గురించి తనకు తెలీదనీ చెప్పాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన రాణే, "నాకు దాని గురించి తెలీదు. వాళ్లే దాన్ని ధ్రువీకరిస్తే గౌరవంగా ఉంటుంది. కానీ అది నిజమైనట్లయితే, ఆ కపుల్ హాటెస్ట్ కపుల్ ఇన్ టౌన్ అవుతుంది." అని అభిప్రాయపడ్డాడు.
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్న కిమ్ శర్మ, హర్షవర్ధన్ రాణే.. 2019లో డేటింగ్ స్టార్ట్ చేశారు. 2020 చివరి నాటికి ఆ ఇద్దరూ విడిపోయారు. దానికి కారణమేంటనేది ఇద్దరూ వెల్లడించలేదు.
![]() |
![]() |