![]() |
![]() |

అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరీముఖ్యంగా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వారిద్దరి హవా బాగానే కనిపించనుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య తాజా చిత్రం `లవ్ స్టోరి` త్వరలోనే విడుదలకు సిద్ధమవగా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ `థాంక్ యూ` చిత్రీకరణ తుది దశలో ఉంది. అలాగే తొలి బాలీవుడ్ మూవీ `లాల్ సింగ్ చద్ధా`
డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో బాల అనే ఆర్మీ ఆఫీసర్ రోల్ లో చైతూ కనిపించబోతున్నాడు. మొత్తమ్మీద.. 2021 సెకండాఫ్
లో చైతూ ముచ్చటగా మూడు సినిమాలతో పలకరించనున్నాడన్నమాట.
ఇక అఖిల్ విషయానికొస్తే.. రొమాంటిక్ డ్రామా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదలకు సిద్ధం కాగా.. ఇటీవలే పట్టాలెక్కిన `ఏజెంట్` క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. సో.. 2021 సెకండాఫ్ లో అఖిల్ రెండు
చిత్రాలతో సందడి చేయబోతున్నట్లు.
మరి.. మొత్తంగా ఐదు చిత్రాలతో సందడి చేయనున్న అక్కినేని బ్రదర్స్ చైతూ, అఖిల్.. ఆయా సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |