![]() |
![]() |
.jpg)
గోవాలోని ఒక బీచ్ ముందు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్.. 'ఖడ్గం' ఫేమ్ కిమ్ శర్మ, వెటరన్ టెన్నిస్ సూపర్‌స్టార్ లియాండర్ పేస్ సన్నిహితంగా కలిసున్న, భోజనం చేస్తూ కెమెరాలకు హ్యాపీగా పోజు ఇచ్చిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గోవాలో జాలీగా గడుపుతున్న గ్లామరస్ యాక్ట్రెస్, టెన్నిస్ ఛాంపియన్ ఫొటోలను 'పౌసాడా బై ద బీచ్' అనే రెస్టారెంట్ షేర్ చేసింది.
సోషల్ మీడియాలో ఆ హోటల్ షేర్ చేసిన రెండు ఫొటోల్లో.. ఒకదానిలో కూర్చొని ఉన్న లియాండర్‌కు ఆనుకొని అతని ముందు కిమ్ నిల్చొంటే, ఆమె నడుం చుట్టూ రెండు చేతులూ బిగించి కౌగలించుకొని ఉన్నాడు పేస్. పక్కనే ఒక పెట్ డాగ్ తలపై చేయి వేసి ఉంది కిమ్. ఇంకో ఫొటోలో.. ఇసుకలో వేసిన టేబుల్‌పై ఫుడ్ సర్వ్ చేసి ఉండగా, అవి తినేందుకు రెడీగా ఉన్నారిద్దరూ. కాకపోతే కెమెరా కోసం పేస్ భుజంపై తలవాల్చి నవ్వుతూ ఉంది కిమ్. పేస్ ఆమె నడుం మీద చేయిపెట్టాడు.
.jpg)
ఈ ఫొటోలను చూస్తేంటే.. హాలిడేస్‌ను జంటగా ఎంజాయ్ చేయడానికే వాళ్లు గోవాకు వెళ్లారనీ, ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనీ అర్థమవుతోంది. అయితే అఫిషియల్‌గా ఈ విషయాన్ని వాళ్లు కన్ఫామ్ చేయలేదు. ఏదేమైనా ఆ ఫొటోలు మాత్రం ఒకరి కంపెనీని మరొకరు బాగా ఎంజాయ్ చేస్తున్నారనీ, ముంబై నుంచి దూరంగా వెళ్లి గడుపుతున్నారనీ తెలియజేస్తున్నాయి. కిమ్ ఇదివరకు తెలుగులో పలు సినిమాలు చేసిన హర్షవర్థన్ రాణేతో డేటింగ్ చేయగా, లియాండర్ తన సహచరి రియా పిళ్లే నుంచి 2017లో విడిపోయాడు.
![]() |
![]() |