![]() |
![]() |
.jpg)
'మైనే ప్యార్ కియా' (ప్రేమ పావురాలు) చిత్రంతో ఒకప్పుడు దేశవ్యాప్తంగా యువత కలలరాణిగా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీ, గతేడాది హైదరాబాద్‌లో 'రాధే శ్యామ్' షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ప్రభాస్‌ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అతని ఆతిథ్యానికి ఆమె ముచ్చటపడిపోయారు. "సెట్స్‌పై ప్రభాస్ నాకు ఓ బాక్స్ పూతరేకులు ఇచ్చాడు. అవెంతో రుచికరంగా అనిపించాయి." అని ఆమె గుర్తు చేసుకున్నారు. అవి ఎక్కడ్నుంచి తెచ్చారని ప్రభాస్‌ను అడిగి, వీలైతే మరికొన్నింటిని తెప్పించమన్నారు భాగ్యశ్రీ.
తర్వాత ఆ విషయం ఆమె మరచిపోయారు. కానీ ఇటీవల, హైదరాబాద్‌లో 'రాధే శ్యామ్' ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు అనేక బాక్సుల పూతరేకులతో ఆమెకు ఆహ్వానం పలికాడు ప్రభాస్. భాగ్యశ్రీ నమ్మలేకపోయారు. "వాటిలో కొన్నింటిని ఇంటికి తీసుకువెళ్లాను. మావాళ్లు వాటిని రుచిచూసి, ఎంతగానో ఇష్టపడ్డారు." అని ఆమె చెప్పారు. ప్రభాస్ మంచితనం, వినయశీలత తనను ఎంతగా ఆకట్టుకున్నాయో ఆమె మాటలే చెబుతాయి. స్టార్‌డమ్ వచ్చాక కూడా ఎలా వినమ్రంగా, నిగర్వంగా ఉండాలో ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలని యంగ్ హీరోలకు ఆమె సూచిస్తారు.
"హోదాపరంగా ఎవరైనా ఎంత ఎదిగినా నిగర్వంగా, వినమ్రంగా ఉంటే అతనెప్పటికీ మంచి మనిషిగా ఉండగలుగుతాడు. ప్రభాస్ లాంటి సూపర్‌స్టార్ ఎలాంటి భేషజాలు ప్రదర్శించకుండా, ఎప్పుడూ డౌన్ టు ఎర్త్‌గా ఉండటం చూడ్డానికి చాలా బాగుంటుంది. సూపర్‌స్టార్‌డమ్ వచ్చినా, సామాన్య వ్యక్తిగా ఎలా ఉండొచ్చో అతను నిరూపిస్తుంటాడు." అని చెప్పారు భాగ్యశ్రీ.
.jpg)
![]() |
![]() |