![]() |
![]() |

తమిళ్ సూపర్ హిట్ మూవీ 'రాక్షసన్' తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. 2019 ఆగస్టు 2న విడుదలై విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది.
రాక్షసుడు సీక్వెల్ 'రాక్షసుడు2' తెరకెక్కబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రమేష్ వర్మనే సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహించబోతున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో ఈ మూవీ రూపొందనుంది. గిబ్రాన్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించానున్నరనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఒక పెద్ద హీరో లీడ్ రోల్ లో నటించనున్నట్లు మాత్రమే మేకర్స్ ప్రకటించారు.

'రాక్షసుడు'లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించారు. అయితే కారణమేంటో తెలీదు గానీ రాక్షసుడు సీక్వెల్ లో బెల్లంకొండ నటించట్లేదని తెలుస్తోంది. అందుకే హీరో విషయంలో మేకర్స్ స్పష్టత ఇవ్వలేదని అర్థమవుతోంది. మరి 'రాక్షసుడు 2'లో నటించే హీరో ఎవరో చూడాలి.
![]() |
![]() |