![]() |
![]() |

'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21F' సినిమాలతో వరుస హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హీరో అయ్యాడు. అయితే ఆ తరువాత మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
'స్టాండప్ రాహుల్' మూవీ టీజర్ ని రానా దగ్గుబాటి శుక్రవారం విడుదల చేశారు. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో స్టాండప్ కమెడియన్‌గా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. స్టాండప్ కామెడీకి ఒరిజినాలిటీ అవసరం అంటూ మొదలైన టీజర్ సరదా సంభాషణలతో కడుపుబ్బా నవ్విస్తోంది. టీజర్ ని బట్టి చూస్తే ఇదో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. రాజ్ తరుణ్ ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లో పడతాడేమో చూడాలి.
నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రజ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |