![]() |
![]() |

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ రానుందంటూ గతంలో వార్తలొచ్చాయి. మణిరత్నం-మహేష్ నడుమ సినిమా గురించి చర్చలు జరిగాయని, త్వరలోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంతవరకు చిన్న అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా మణిరత్నం.. మహేష్ తో మూవీ గురించి స్పందించారు.
తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన మణిరత్నం.. మహేష్ తో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమేనని, ఆయనతో చర్చలు కూడా జరిగాయని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదని.. అనంతరం తామిద్దరం ఇతర వర్క్స్ తో బిజీగా ఉన్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే మహేష్ తో సినిమా చేస్తానని తెలిపారు. నేరుగా తెలుగులో ఒక సినిమా చేసే ఆలోచన ఉందని.. కానీ ఆ సమయం ఎప్పుడు వస్తుందో చూడాలని అన్నారు.
మణిరత్నంతో సినిమా చేయాలని ఎందరో హీరోలు ఆశపడుతుంటారు. అయితే ఇటీవల ఆయన ట్రాక్ రికార్డు చూసి టాలీవుడ్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి వెనకాడుతున్నారు. ఇటీవల మణిరత్నం ఓ కథ పట్టుకొని మహేష్ తో పాటు మరికొందరు టాలీవుడ్ హీరోల చుట్టూ తిరిగారట. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. దేశం గర్వించదగిన దర్శకులలో ఒకరిగా మణిరత్నం పేరు తెచ్చుకున్నారు. అలాంటి దర్శకుడికి అప్పుడెప్పుడో నాగార్జునతో చేసిన ‘గీతాంజలి’ తర్వాత ఇన్నాళ్ళకు నేరుగా తెలుగులో సినిమా చేయాలని ఆలోచన వచ్చింది. మరి ఆయనకు ఏ టాలీవుడ్ హీరో డేట్స్ ఇస్తాడో చూడాలి.
![]() |
![]() |