Home  »  News  »  మోస్ట్‌ అవెయిటెడ్‌ 'నవరస' టీజర్ వచ్చేసింది.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Updated : Jul 9, 2021

తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అంద‌రిలో ఆస‌క్తి క‌లిగించిన అంథాల‌జీ ఫిల్మ్ 'న‌వ‌ర‌స‌'. దిగ్గజ దర్శకులు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ చేతులు కలిపి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మించారు. మాన‌వ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని న‌వ‌ర‌సాలు అని కూడా అంటాం. వీటి ఆధారంగా 'న‌వ‌ర‌స‌' రూపొందింది. తాజాగా ఈ అంథాల‌జీ విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో ఈ అంథాల‌ ఆగ‌స్ట్ 6న విడుద‌ల కానుంది.

'నవరస' కోసం పలువురు కోలీవుడ్ స్టార్స్ చేతులు కలిపారు. టాప్‌ మోస్ట్‌ నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల కలిసి ఈ అంథాలజీకి ప్రాణం పోశారు. అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్, ప్రియదర్శన్, రతీంద్రన్ ప్రసాద్, సర్జున్, వసంత సాయి దర్శకత్వం వహించిన ఈ తొమ్మిది కథలలో.. సూర్య, సిద్ధార్థ్‌, విజయ్‌ సేతుపతి, ప్రకాష్ రాజ్, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, నిత్యా మీనన్, అరవింద్‌ స్వామి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డ సినీ పరిశ్రమలోని కార్మికుల శ్రేయస్సు కోసం ఈ అంథాల‌జీ ఫిల్మ్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగించనున్నారు. మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్‌ మాట్లాడుతూ.. "మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ చాలా ఘోరంగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. అలాంటి బలమైన కోరికలో నుంచి నవరస పుట్టింది. ఈ ప్రాజెక్ట్స్ కోసం అందరూ మనసు పెట్టి కష్టపడ్డారు. 12000 మంది సహోద్యోగులకు దీని ద్వారా సహకారాన్ని అందించబోతున్నాం. ఈ భావోద్వేగ ప్రయాణంలో భాగమైన నెట్‌ఫ్లిక్స్‌ సంస్థకు ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం" అన్నారు.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.