![]() |
![]() |

తెలుగు, తమిళ భాషా చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన నందితా శ్వేత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వస్తోంది. సోషల్ మీడియా ద్వారా తాము ఆరాధించే సెలబ్రిటీలపై అభిమానులు ఎంతో ప్రేమను, ఆత్మీయతను చూపిస్తుంటారు. మరోవైపు ఫేక్ ఐడీలతో వారిపై ఇష్టం వచ్చినట్లు, అభ్యంతరకర రీతిలో కామెంట్లు చేసే కొంతమంది పోకిరీలు కూడా ఉంటుంటారు.
ఇవాళ్టి రోజుల్లో అలాంటి చెత్త నుంచి తప్పించుకోవడం సోషల్ మీడియాలో సాధ్యం కాకపోయినా, సెలబ్రిటీల్లో ఎక్కువమంది పనికిమాలిన కామెంట్లను అస్సలు పట్టించుకోరు. కొంతమంది మాత్రం అలా నెగటివ్ కామెంట్లు చేసేవారికి గట్టి సమాధానమే ఇస్తుంటారు. లేటెస్ట్‌గా ఆ కొద్దిమంది సెలబ్రిటీల లిస్టులో గ్లామరస్ యాక్ట్రెస్ నందితా శ్వేత చేరింది.
సోషల్ మీడియాలో ఇటీవల తన ఫ్యాన్స్‌తో ఆమె ఇంటరాక్ట్ అవుతుండగా, ఒక నెటిజన్ ఆమెను ఛాతీ సైజు చెప్పమంటూ అభ్యంతరకర రీతిలో ప్రశ్నించాడు. దానికి నందిత, "మీ అమ్మ, చెల్లి, వదిన, ఫ్రెండ్, ఫ్రెండ్ సిస్టర్‌ను ఇదే ప్రశ్న ఎందుకు అడగవు? వాళ్లు నీకు సరిగ్గా జవాబిస్తారు." అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. ఆమె కరెక్టుగా స్పందించిందంటూ పలువురు ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
వర్క్ విషయానికి వస్తే కొన్ని 'జెట్టి' అనే సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది నందితా శ్వేత. మత్స్యకారుల జీవితాలను లోతుగా స్పృశిస్తూ సుబ్రహ్మణ్యం పిచ్చుక అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ సినిమాలో ఆమె మెయిన్ రోల్ పోషించింది. ఈ సినిమా నటిగా తన ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తుందనే ఆశాభావంతో ఆమె ఉంది.
![]() |
![]() |