![]() |
![]() |
.jpg)
ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ `ఆచార్య` తరువాత మెగాస్టార్ చిరంజీవి.. బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసిఫర్`కి రీమేక్ కాగా.. మరొకటి కోలీవుడ్ సూపర్ హిట్ `వేదాళమ్`కి రీమేక్. వీటిలో `లూసిఫర్` రీమేక్ ని `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన రాజా రూపొందించనుండగా.. `వేదాళమ్` రీమేక్ ని మెహర్ రమేశ్ తీర్చిదిద్దనున్నారు. వీటిలో `లూసిఫర్` రీమేక్ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. `వేదాళమ్` రీమేక్ కూడా మరో మూడు నెలల్లో పట్టాలెక్కనుందట. ఈ విషయాన్ని ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్న `బిగ్ బాస్ సీజన్ 4` ఫేమ్ దివి వెల్లడించింది. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనుండడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని.. మరో మూడు నెలల్లో ఈ రీమేక్ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందని ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది దివి. త్వరలోనే `వేదాళమ్` రీమేక్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. మరి.. రాబోయే చిత్రాలతో మెగాస్టార్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
![]() |
![]() |