![]() |
![]() |

సీనియర్ నటి కవిత భర్త దశరథ రాజు కన్నుమూశారు. మూడు వారాల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.
ఇప్పటికే కరోనా కారణంగా రెండు వారాల క్రితం కవిత కుమారుడు స్వరూప్ కన్నుమూశాడు. జూన్ 15 న కరోనా కారణంగా కవిత కుమారుడు ప్రాణాలను విడిచాడు. ఆ ఘటన మరవక ముందే ఆమె భర్త కూడా కరోనా కాటుకు బలయ్యారు. రెండు వారాల వ్యవధిలో జరిగిన రెండు ఘటనలతో కవిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దశరథ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు కవితను పరామర్శిస్తున్నారు.

11 సంవత్సరాల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి అడుగుపెట్టిన కవిత.. ఆ తరువాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను రాణించారు. 350కు పైగా చిత్రాల్లో నటించిన కవిత సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
![]() |
![]() |