![]() |
![]() |

`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ - రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం `పుష్ప`. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో మాలీవుడ్ స్టార్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. బన్ని - సుక్కు - డీఎస్పీ కాంబినేషన్ అంటేనే చార్ట్ బస్టర్స్ కి కేరాఫ్ అడ్రస్. ఈ నేపథ్యంలో.. `పుష్ప` పాటలపై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. దీనికితగ్గట్టే.. `పుష్ప` ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 2న `పుష్ప` ఫస్ట్ లిరికల్ వీడియోని రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు.. డీఎస్పీ మార్క్ క్యాచీ ట్యూన్ తోనే ఈ పాట రూపొందిందని వినికిడి. త్వరలోనే `పుష్ప` ఫస్ట్ సింగిల్ పై క్లారిటీ రానున్నది. మరి.. ఈ ఫస్ట్ సింగిల్ ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |