![]() |
![]() |

కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. కరోనా ప్రభావం తగ్గి థియేటర్లు తెరుచుకున్నా.. ప్రేక్షకులు ఇప్పట్లో థియేటర్ల బాటపట్టే అవకాశం లేదు. దీంతో పలు సినిమాలు నేరుగా ఓటీటీలలో విడుదల అవుతున్నాయి. వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన 'నారప్ప'ను కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జూలై 24 న అమెజాన్ ప్రైమ్ లో నారప్ప విడుదల కానుందని తెలుస్తోంది. అయితే దీన్ని వెంకీ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. నారప్ప మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని పట్టుబడుతున్నారు.
నారప్ప సినిమా ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా వెంకీ అభిమాని నిరాహార దీక్షకు దిగడం ఆసక్తికరంగా మారింది. వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ అనే అతను వెంకీకి వీరాభిమాని. వెంకీ సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. థియేటర్ కి వెళ్లి రచ్చరచ్చ చేస్తాడట. అయితే ఇప్పుడు నారప్ప సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అవుతుందని న్యూస్ రావడంతో.. నారప్ప సినిమా ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టాడు. సినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. నారప్ప ఓటీటీ విడుదలకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలంటూ ఇతర వెంకీ అభిమానులను కోరుతున్నాడు. మరి నారప్ప విడుదలపై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

కాగా, తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'అసురన్'కు రీమేక్ గా 'నారప్ప' రూపొందింది. ఇందులో వెంకటేష్ కు జోడిగా ప్రియమణి నటించింది.
![]() |
![]() |