![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' మూవీ టీం నుండి ఈరోజు కీలక అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి అయ్యిందని.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్ కూడా పూర్తి చేశారని మూవీ టీం తెలిపింది. అలాగే తాజాగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ఒకే బైక్ పై తారక్, చరణ్ లు చిరునవ్వులు చిందిస్తూ ఉండటం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ పోస్టర్ పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు, మూవీ టీంకు మధ్య ట్విట్టర్ వేదికగా జరిగిన సంభాషణ నవ్వులు పూయిస్తోంది.
'ఆర్ఆర్ఆర్' పోస్టర్ ని తమదైన శైలిలో ఉపయోగించుకున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఆ పోస్టర్ ను కొంచెం ఎడిట్ చేసి.. తారక్, చరణ్ లకు హెల్మెట్లు పెట్టారు. ఆ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. "ఇప్పుడు ఫర్‌ఫెక్ట్ గా ఉంది. హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
ఇక ట్రాఫిక్ పోలీసుల ట్వీట్ పై ఆర్‌ఆర్‌ఆర్ టీం కూడా ఫన్నీగా స్పందించింది. "ఇప్పటికి అది ఫర్‌ఫెక్ట్ గా లేదు. నెంబర్ ప్లేట్ మిస్సయింది" అంటూ ఫన్నీ రిప్లయ్ ఇచ్చింది.
![]() |
![]() |