![]() |
![]() |

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ లో సందడి చేయాల్సిన పలు చిత్రాలు ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే, తొలి దశ తగ్గుముఖం పట్టాక థియేట్రికల్ రిలీజెస్ సందడి మరల కనిపించినా.. రెండో దశ విజృంభణతో మళ్ళీ ఓటీటీ వేదికలనే నమ్ముకుంటున్నారు మేకర్స్. తెలుగునాట `నారప్ప`, `దృశ్యం 2`, `విరాట పర్వం` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ నేరుగా ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయనే ప్రచారం ఒకవైపు సాగుతుండగా.. తాజాగా తమిళనాట ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఓటీటీ రిలీజ్ ని కన్ఫామ్ చేసుకుంది. ఆ సినిమానే.. `డాక్టర్`.
కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్, `గ్యాంగ్ లీడర్` ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా `బీస్ట్` కెప్టెన్ నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన ఈ సినిమా.. ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుందంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్`లో తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మెడికల్ యాక్షన్ డ్రామా స్ట్రీమ్ కానుంది. అంతేకాదు.. ఆగస్టు నెలలో ఈ సినిమా స్ట్రీమ్ కాబోతోందని సమాచారం. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై కూడా అఫిషియల్ న్యూస్ రానున్నది.
మరి.. శివకార్తికేయన్ తొలి ఓటీటీ మూవీగా స్ట్రీమ్ కాబోతున్న `డాక్టర్`.. ఏ స్థాయిలో వీక్షకాదరణ పొందుతుందో చూడాలి.
![]() |
![]() |