![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు మాటల యుద్ధానికి దారి తీస్తున్నాయి. మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ అంటూ ఇప్పటికే కరాటే కళ్యాణి వ్యాఖ్యలు చేయగా.. తాజాగా కోట శ్రీనివాసరావు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు 'మా' ఎన్నికలను ఎవరు అనౌన్స్ చేశారు?.. ఇప్పుడున్న కమిటీ ప్రకటించిందా?.. ఇంకా ప్రకటించకుండానే అప్పుడే వీళ్ల హడావిడి ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాష్ రాజ్ కి కొందమంది సీనియర్ నటులు మద్దతు ఇవ్వడాన్ని, అప్పుడే ప్యానల్ ప్రకటించడాన్ని కోట తప్పుబట్టారు. టైం వచ్చినప్పుడు మాట్లాడాలి కానీ ఎన్నికలు ప్రకటించకుండానే ఈ హడావుడి ఎందుకని ప్రశ్నించారు. కరోనా టైంలో అసలు ఈ గోల ఎందుకని మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ అనే కాదు.. మిగిలిన వాళ్లు కూడా ఎందుకు మాట్లాడుతున్నారని అడిగారు. ప్రకాష్ రాజ్ తనకి చిరంజీవి మద్దతు ఉందని అంటున్నారు. మద్దతు ఉంటే ఉండొచ్చు కానీ.. దీనిపై నాగబాబు మాట్లాడటం సరికాదని కోట అన్నారు.
అలాగే సాయి కుమార్ సపోర్ట్ చేస్తున్నాడని ప్రకాష్ రాజ్ అంటున్నారు. అసలు సాయి కుమార్ బీజేపీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి.. ప్రకాష్ రాజ్ బీజేపీ వ్యతిరేకి. అలాంటిది ప్రకాష్ రాజ్ ని ఎలా సపోర్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. తాను ఎప్పటి నుంచో బీజేపీ పార్టీలో కొనసాగుతున్నా కాబట్టి అడుగుతున్నానని కోట అన్నారు.
'మా'లో 900 మంది సభ్యులుంటే.. వారిలో ఓటు వేసేది ఓ నాలుగు వందల మంది ఉంటారు. ఇది నాలుగు వందల మందికి సంబంధించిన విషయం. జనాలకు సంబంధం లేదు. దాని గురించి ఇంత రాద్దాంతం ఎందుకు? అని కోట ఫైర్ అయ్యారు.
![]() |
![]() |