![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించనున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'ను తెలుగులో మోహన్ రాజా దర్శకత్వంలో చిరు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
తాజాగా తమన్ లూసిఫర్ రీమేక్ కు సంబంధించిన ఓ ట్వీట్ చేశాడు. లూసిఫర్ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవిపై ప్రేమ చూపించే సమయం వచ్చింది. ఖచ్చితంగా సూపర్ హై స్టఫ్ ఉంటుంది అంటూ తమన్ ట్వీట్ చేశాడు.
తమన్ ట్వీట్ మెగా ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది. అసలే ఇప్పుడు తమన్ మంచి ఫాంలో ఉన్నాడు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దుమ్ములేపుతున్నాడు. మలయాళ లూసిఫర్ ను మించి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
![]() |
![]() |