![]() |
![]() |

రజనీకాంత్ టైటిల్ పాత్రధారిగా శంకర్ డైరెక్ట్ చేసిన 'శివాజీ' (2007) బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టయింది. తెలుగులోనూ ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విడుదలై జూన్ 15కు పద్నాలుగేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆ సినిమా హీరోయిన్ శ్రియ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆ సినిమానీ, ఆ సినిమాకు పనిచేసిన రోజుల్నీ తానెప్పటికీ మరచిపోలేనని ఆమె తెలియజేసింది.
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా శివాజీ సినిమా పోస్టర్‌ను షేర్ చేసిన శ్రియ, "ఇదెప్పటికీ నన్ను బాగా ఆనందింపజేసే జ్ఞాపకం. ఇలాంటివి ఇంకెన్నో చేయాలనుకుంటున్నాను. నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ శంకర్. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. మీరు అత్యంత శ్రేష్ఠులు. ఈ వండర్‌ఫుల్ ఫిల్మ్ కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ సర్ పనిచేశారు. అంత పెద్ద సూపర్‌స్టార్ అయినా కూడా ఎంతో హంబుల్‌గా, సింపుల్‌గా ఉంటారు. మీ సెన్సాఫ్ హ్యూమర్‌ను మిస్సవుతున్నాను. నాకు తెలిసినవారిలో మీరు అత్యంత హార్డ్‌వర్కింగ్ యాక్టర్. నేనెప్పుడూ ఇష్టపడే మ్యూజిక్‌ను ఇచ్చినందుకు థాంక్ యూ ఎ.ఆర్. రెహమాన్ సార్. అలాగే వండర్‌ఫుల్ యూనిట్‌కు కూడా. బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ ఇచ్చినందుకు మనీష్ మల్హోత్రాకు. వాళ్లను మిస్సవుతున్నా. స్టన్నింగ్ క్లోత్స్ డిజైన్ చేసిన నీతా లుల్లాకు థాంక్స్. సో సో సో సెక్సీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పటికీ ఈ ఫిల్మ్‌ను లవ్ చేస్తూనే ఉంటాను." అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మాండమైన విజయం సాధించడమే కాకుండా, పలు అవార్డులను సైతం ఈ సినిమా అందుకుంది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డును అందుకున్న ఈ సినిమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డులను అందుకుంది. ఈ సినిమాలో విలన్‌గా సుమన్ నటించగా, రఘువరన్, వివేక్, మణివణ్ణన్, వడివుక్కరసి కీలక పాత్రలు పోషించారు. రెహమాన్ ఇచ్చిన పాటలు సూపర్ హిట్టయ్యాయి.
![]() |
![]() |