![]() |
![]() |

ఫస్ట్ సిరీస్‌కు మించి బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్. రాజ్ అండ్ డీకే ద్వయం డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి రోల్‌ను మనోజ్ బాజ్‌పేయి చేయగా, రాజ్యలక్ష్మి అలియాస్ రాజీ అనే నెగటివ్ రోల్‌ను సమంత అక్కినేని చేసింది. తమిళ ఈలం కోసం ప్రాణాల్ని సైతం తృణంగా అర్పించే రెబల్ రోల్‌లో సమంత నటన ఆడియెన్స్‌నే కాకుండా, విమర్శకుల్నీ విపరీతంగా మెప్పించింది. అందరికంటే ఎక్కువ మార్కులు ఆమెకు, ఆ తర్వాత మనోజ్ బాజ్‌పేయి నటనకూ వచ్చాయి.
అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ రిలీజయ్యాక, సమంతకు పలు హిందీ సినిమాల ఆఫర్లతో పాటు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నుంచి ఓ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. కాగా 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో నెగటివ్ రోల్‌లో నటించడానికి సమంత భారీ రెమ్యూనరేషన్ అందుకుందనీ, అది రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య ఉందనీ కూడా జోరుగా వార్తలు వచ్చాయి. అలాగే మనోజ్ బాజ్‌పేయికి రూ. 10 కోట్లు అందాయని వినిపించింది.
కానీ అదంతా ఒట్టిదేననీ, ఆ రేంజ్‌లో వారికి రెమ్యూనరేషన్ అందలేదని లేటెస్ట్‌గా ఓ పోర్టల్ వెల్లడించింది. దాని ప్రకారం మనోజ్‌కు అందిన రెమ్యూనరేషన్ కేవలం రూ. 2.5 కోట్లే. సమంతకు అయితే ఇంకా తక్కువ అంట. ఆమెకు నిర్మాతలు ఇచ్చింది రూ. 1.5 కోట్లేననేది ఆ పోర్టల్ కథనం. తెలుగులో విమన్ సెంట్రిక్ ఫిలిమ్స్‌తో పాటు, నటనకు అవకాశం ఉన్న అర్థవంతమైన పాత్రలు చేస్తూ వస్తున్న సమంత.. ఒక డీగ్లామరస్ రోల్.. అందునా నెగటివ్ రోల్ చేయడానికి కేవలం రూ. 1.5 కోట్లే తీసుకుందా.. అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ పాత్ర బాగా నచ్చినందువల్లే, అది తనకు ఛాలెంజింగ్ రోల్ అవుతుందని నమ్మడం వల్లే రెమ్యూనరేషన్ తక్కువైనా చేసిందని అంటున్నారు.
ఏదేమైనా ఎన్ని తెలుగు సినిమాల్లో చేసినా రాని పేరు ఒక్క వెబ్ సిరీస్‌తో వచ్చేసిందనీ, అంతకంటే ఆమెకు కావాల్సిందేముందనీ వారుంటున్నారు. అదీ నిజమే! ఇప్పుడు సమంతకు వచ్చిన క్రేజ్ చూస్తుంటే.. ఆమె రూ. 5 కోట్లు అడిగినా ఇచ్చేందుకు హిందీ సినిమాల నిర్మాతలు రెడీగా ఉన్నారనేది వాళ్ల వాదన.
![]() |
![]() |