![]() |
![]() |
.jpg)
``భార్యాభర్తల బంధం పాలునీళ్ళ కలయికలాంటిది.. ఏ ఒక్కరు ఆవేశంతో తొందరపడినా ఆ కాపురం కుప్పకూలుతుంది`` అనే సందేశంతో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం `పాలు - నీళ్ళు`. `కలెక్షన్ కింగ్` మోహన్ బాబు - అందాల తార జయప్రద ఇందులో జంటగా దర్శనమిచ్చారు. వారిద్దరు నాయకానాయికలుగా కలిసి నటించిన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం. `దర్శకరత్న` దాసరి నారాయణరావు రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కేవీ చలం, రావికొండలరావు, కబీర్ దాస్, సూర్యకాంతం, నిర్మలమ్మ, రమాప్రభ ముఖ్య పాత్రలు పోషించగా.. లాయర్ పాత్రల్లో దాసరి, ప్రభాకర్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే ప్రముఖ హిందీ గాయని ఆశా భోస్లే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం విశేషం. ఇందులోని ``ఇది మౌనగీతం.. ఒక మూగరాగం..`` అంటూ సాగే గీతాన్ని ఆశ ఆలపించారు.
ఈ చిత్రానికి సత్యం సంగీతమందించగా.. వేటూరి సుందరరామ్మూర్తి, దాసరి సాహిత్యమందించారు. `తెలుగు చిత్ర ఇంటర్నేషనల్` పతాకంపై రామినేని సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1981 జూన్ 12న విడుదలై మహిళా ప్రేక్షకుల ఆదరణతో విజయపథంలో పయనించిన `పాలు - నీళ్ళు`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |