![]() |
![]() |

హీరోయిన్ తాప్సీ డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్ తో ప్రేమలో పడింది అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన తాప్సీ ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం చెప్పింది.
తన పెళ్లిపై స్పందించిన తాప్సీ.. తాను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, ఏడాదికి ఆరు సినిమాల్లో నటిస్తున్నానని, ఆ సంఖ్య రెండు మూడుకు తగ్గినప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. సినీ రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టంలేదని చెప్పింది. మనం రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం రెండూ వేర్వేరుగా ఉండాలని ఆమె అభిప్రాయపడింది. ఇక మ్యాథ్యూస్ గురించి చెబుతూ.. అతను తనకు బాగా తెలిసిన వ్యక్తి, సన్నిహితుడు అని చెప్పుకొచ్చింది.
కాగా, తెలుగు సినిమా 'ఝుమ్మంది నాదం'తో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. ఆమె నటించిన 'రష్మీ రాకెట్' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లోనూ నటిస్తోంది.
![]() |
![]() |