![]() |
![]() |

కథానాయకుడిగా నేచురల్ స్టార్ నాని స్థాయిని పెంచిన చిత్రాల్లో `ఎంసీఏ`(2017) ఒకటి. ఇందులో మిడిల్ క్లాస్ అబ్బాయ్ గా నాని నటన ఆల్ క్లాస్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక నానికి జోడీగా `చిన్ని` పాత్రలో సాయిపల్లవి కూడా తనదైన అభినయంతో అలరించింది. కట్ చేస్తే.. నాలుగేళ్ళ తరువాత నాని, పల్లవి మరో సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఆ చిత్రమే.. `శ్యామ్ సింగ రాయ్`. పిరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి మిగిలిన షూటింగ్ ని కరోనా పరిస్థితులు చక్కదిద్దుకున్నాక పూర్తిచేయనున్నారు. అంతేకాదు.. అన్నీ కుదిరితే క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. `ఎంసీఏ` కూడా 2017లో క్రిస్మస్ స్పెషల్ గానే విడుదలై ఘనవిజయం సాధించింది. మరి.. `ఎంసీఏ` బాటలోనే వెళ్ళనున్న `శ్యామ్ సింగ రాయ్` కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందేమో చూడాలి.
కాగా, `శ్యామ్ సింగ రాయ్`లో సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టయిన్ కూడా నాయికలుగా నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |