![]() |
![]() |

కొవిడ్ మహమ్మారి దెబ్బకు మరో సినీ నటుడు బలయ్యాడు. 'చెలువిన చిత్తర', 'ఉగ్రమ్' లాంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కన్నడ సీనియర్ నటుడు సురేశ్ చంద్ర కొవిడ్‌తో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కొద్ది రోజుల అడ్మిట్ అయిన సురేశ్ చంద్ర చికిత్సకు స్పందించలేదని వైద్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు.
50కి పైగా కన్నడ చిత్రాల్లో నటించిన సురేశ్ చంద్ర కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయి, బెంగళూరులోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
'చెలువిన చిత్తర', 'ఉగ్రమ్' చిత్రాల్లో చేసిన విలన్ పాత్రలతో ఆయన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు. ప్రతిభావంతుడైన నటునిగా కన్నడ చిత్రసీమలో పేరు తెచ్చుకున్నారు. కిచ్చ హుచ్చ, రాణా, శైలూ, కాళిదాస కన్నడ మేష్ట్రు, అప్పయ్య, జంగ్లీ లాంటి పలు హిట్ మూవీస్‌లో ఆయన నటించారు. ఎక్కువగా నెగటివ్ రోల్స్‌తో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిసారిగా తెరమీద కనిపించిన చిత్రం 'కాళిదాస కన్నడ మేష్ట్రు' (2019).
![]() |
![]() |