![]() |
![]() |

హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్-హరీష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పలువురు భామల పేర్లు వినిపిస్తున్నాయి. మలయాళ యంగ్ బ్యూటీ మానస రాధాకృష్ణన్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.
పవన్ సరసన నటించనున్నట్లు వస్తున్న వార్తలపై మానస రాధాకృష్ణన్ తాజాగా స్పందించింది. "నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం .. కానీ ఆయన 28వ సినిమాలో నేను నటించడం లేదు" అని ఆమె క్లారిటీ ఇచ్చింది.
కాగా, వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాతో పాటు.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత హరీష్ శంకర్ తో చేయనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.
![]() |
![]() |