![]() |
![]() |

హీరో గోపీచంద్- డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'పక్కా కమర్షియల్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. ఈ మూవీలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ విడుదలైంది. రేపు(జూన్ 12) గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. మూవీ టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్న గోపీచంద్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఇది ఓ సాంగ్ లోని స్టిల్ అని అర్థమవుతోంది.

'పక్కా కమర్షియల్' సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతోంది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఈ బ్యానర్స్ లో దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు టైటిల్ కి తగ్గట్టే గోపీచంద్ తో ఓ పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మారుతి. తన గత చిత్రం 'ప్రతీరోజూ పండగే'తో మంచి హిట్ అందుకున్న మారుతి.. కొంతకాలంగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు హిట్ అందిస్తాడేమో చూడాలి.
'పక్కా కమర్షియల్' సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో రాశీ ఖన్నా ముచ్చటగా మూడోసారి గోపీచంద్ సరసన నటించినట్లు అవుతుంది. గతంలో వీరిద్దరూ జిల్, ఆక్సిజన్ సినిమాల్లో కలిసి నటించారు.
![]() |
![]() |