![]() |
![]() |

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం ఆయన హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రాజ రాజ చోర' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 18న ఈ మూవీ టీజర్ విడుదల కానుంది. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ వాయిస్ తో ఒక వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
'చోర గాథ బై గంగవ్వ' పేరుతో మేకర్స్ వీడియో రిలీజ్ చేశారు. 2డీ యానిమేషన్ లో రూపొందించిన వీడియోలో 'ఊ కొట్టే కథ చెబుతా.. ఊ కొడతావా' అంటూ తన మనవరాలికి రాజు-దొంగ కథ చెప్పింది గంగవ్వ. సూర్యుడు నుంచి భూమి.. భూమి నుంచి కోతి, బంగారం.. కోతి నుంచి మనిషి, బంగారం నుంచి కిరీటం పుట్టుకొచ్చాయని.. మనిషి దొంగోడుగా, కిటీటం రాజుగా రూపాంతరం చెందాయి. అయితే రాజు లాగే తనకి కూడా గుర్తింపు కావాలని భావించి దొంగ.. రాజు కిరీటాన్ని దొంగలిస్తాడు. కిరీటం పోవడంతో రాజు ఇబ్బందులు పడతాడు. ఆ దొంగను పట్టుకోవడానికి రాజు ఏం చేశాడు? చివరకు ఆ దొంగ దొరికాడా, లేదా? అంటూ గంగవ్వ ఆసక్తికరంగా కథ చెప్పింది. కథ చెప్పిన విధానం, కథలో చూపించిన 2డీ యామినేషన్ ఆకట్టుకున్నాయి.
ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |