![]() |
![]() |

మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'క్రాక్' వంటి సూపర్ హిట్ తరువాత రవితేజ నుండి వస్తున్న మూవీ కావడంతో ఖిలాడీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలాఉంటే ఈ మూవీ ఇద్దరి కెరియర్ లో స్పెషల్ మూవీగా నిలవనుంది. వారిలో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాగా, మరొకరు లిరిక్ రైటర్ శ్రీమణి.

1999 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'దేవి' సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ ప్రసాద్.. ఈ సినిమా పేరును తన పేరులో చేర్చుకుని దేవి శ్రీ ప్రసాద్ గా మారాడు. 19 ఏళ్లకే మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన దేవి.. ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ని అందించాడు. ఖడ్గం, మన్మథుడు, వర్షం, ఆర్య, బొమ్మరిల్లు, జల్సా, గబ్బర్ సింగ్.. ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే ఉంది. దేవి మ్యూజిక్ అందించిన చిత్రాలు దాదాపు అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచినవే. రెండు దశాబ్దాలకు పైగా మ్యూజిక్ డైరెక్టర్ గా అలరిస్తున్న దేవి.. ఇప్పుడు ఖిలాడీతో మ్యూజిక్ డైరెక్టర్ గా వందో సినిమా పూర్తి చేసుకోబోతున్నాడు. మరి సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్ కు 100వ సినిమా అయిన ఖిలాడి ఆయన కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఆశిద్దాం.
ఇక ఈ ఖిలాడి మూవీ.. లిరిక్ రైటర్ శ్రీమణి కెరియర్ లోనూ స్పెషల్ గా నిలవనుంది. శ్రీమణి అసలు పేరు పాగోలు గిరీష్. అయితే తన తల్లి నాగమణి పేరు కలిసొచ్చేలా.. శ్రీమణి అని పేరు మార్చుకున్నాడు. చిన్నప్పటి నుండి కవిత్వంపై ఆసక్తి ఉన్న శ్రీమణి.. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఎన్నో సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పాటలు అందించాడు. 2011 లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ సినిమాతో లిరిక్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో అహో బాలు, దటీజ్ మహాలక్ష్మి, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ మూడు పాటలు రాసి మెప్పించాడు. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. ఆరడుగుల బుల్లెట్, ప్రేమ వెన్నెల వంటి సాంగ్స్ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు దేవి కాంబినేషన్ లోనే ఓ మైలురాయిని అందుకోబోతున్నాడు. దేవి మ్యూజిక్ అందిస్తున్న ఖిలాడి సినిమాలో ఆయన తన 500 వ పాటను రాస్తున్నాడు.
![]() |
![]() |