![]() |
![]() |
.jpg)
తెలుగులో అనువాదమైనప్పటికీ.. ఎంతో ముచ్చటపడి మరీ మాలీవుడ్ సెన్సేషన్ 'లూసిఫర్'ని రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి.. ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. 'హనుమాన్ జంక్షన్' ఫేమ్ మోహనరాజా డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు. తనకు చిన్నతనంలోనే ఆశ్రయం ఇచ్చి, ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా తన ఉన్నతికి తోడ్పడిన మనిషి కుటుంబానికి విపత్కర స్థితిలో అండదండగా నిలిచిన వ్యక్తిగా ఈ సినిమాలో చిరంజీవి కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న జరుపనున్నారని సమాచారం. అంతేకాదు.. 2022 వేసవిలో ఈ భారీ బడ్జెట్ మూవీని రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది.
కాగా, ప్రస్తుతం చిరు నటిస్తున్న 'ఆచార్య'.. చిత్రీకరణ తుది దశలో ఉంది. ఇందులో తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారాయన. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామాకి మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు. చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జంటగా పూజా హెగ్డే కనువిందు చేయనున్నారు. కరోనా పరిస్థితులు చక్కదిద్దుకున్నాక చిత్రీకరణ పునః ప్రారంభం కానుంది.
![]() |
![]() |