![]() |
![]() |

మోహన్‌బాబు టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను తమిళ స్టార్ యాక్టర్ సూర్య విడుదల చేయనున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 12:20 గంటలకు సూర్య ఈ టీజర్‌ను ఆవిష్కరించనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.
సూర్య హీరోగా నటించిన మునుపటి సినిమా 'ఆకాశమే నీ హద్దురా' (తమిళ ఒరిజినల్ 'సూరారై పొట్రు')లో మోహన్‌బాబు ఓ కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఆ ఇద్దరి మధ్యా మంచి స్నేహం, సన్నిహితత్వం ఏర్పడ్డాయి. సూర్య డిసిప్లిన్, పర్ఫార్మెన్స్‌ను మోహన్‌బాబు ప్రశంసించారు కూడా. ఇప్పుడు తన సినిమా 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్‌ను లాంచ్ చేయాల్సిందిగా మోహన్‌బాబు అడిగిన వెంటనే అంగీకరించాడు సూర్య.

దేశభక్తి కథాంశంతో రూపొందుతోన్న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంలో మోహన్‌బాబు ఇదివరకెన్నడూ పోషించని శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారని దర్శకుడు డైమండ్ రత్నబాబు చెప్పారు. అంతేకాదు, ఇంతదాకా ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదన్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం. మోహన్‌బాబును ఆమె పూర్తిగా సరికొత్త రూపంలో చూపిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
డాక్టర్ మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా చిన్నా పనిచేస్తున్నారు.
![]() |
![]() |