![]() |
![]() |

కెరీర్ ఆరంభంలో `ఆర్య`, `ఆర్య 2`, `100% లవ్`.. ఇలా లవ్ స్టోరీలతోనే ఎంటర్టైన్ చేశారు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్. అయితే, `100% లవ్` తరువాత పూర్తిగా యాక్షన్ డ్రామాల బాట పట్టారాయన. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీసిన `1 నేనొక్కడినే`, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన `నాన్నకు ప్రేమతో`, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో రూపొందించిన `రంగస్థలం`.. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్స్ నే. వీటిలో రొమాంటిక్ ట్రాక్ కి చోటిచ్చినా.. ఫోకస్ మాత్రం `యాక్షన్`పైనే సాగింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సుక్కు చేస్తున్న `పుష్ప` కూడా యాక్షన్ థ్రిల్లర్ నే కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. భారీ విరామం అనంతరం సుకుమార్ మరో ప్రేమకథా చిత్రం చేయనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సుక్కు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది.. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ అని టాక్. అంతేకాదు.. తాజాగా స్క్రిప్ట్ కూడా లాక్ చేశారని వినికిడి. 2022 చివరలో ఈ మూవీ పట్టాలెక్కుతుందని అంటున్నారు. మరి.. చాన్నాళ్ళ తరువాత సుక్కు చేస్తున్న ఈ లవ్ స్టోరీ.. ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |