![]() |
![]() |

కథానాయకుడిగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ది ఏడేళ్ళ ప్రస్థానం. ఈ ఏడేళ్ళలో ఎనిమిది సినిమాలతో సందడి చేశాడు. వీటిలో `రాక్షసుడు` (2019) మంచి విజయం సాధించింది. తమిళ చిత్రం `రాక్షసన్`కి
రీమేక్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తో ఫస్ట్ సాలిడ్ హిట్ కొట్టాడు సాయిశ్రీనివాస్. అయితే, గత చిత్రం `అల్లుడు అదుర్స్` మాత్రం తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సాయిశ్రీనివాస్ చేతిలో రెండు చిత్రాలున్నాయి. ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్ మూవీస్ కి రీమేక్స్ కావడం విశేషం. ఆ బ్లాక్ బస్టర్ మూవీసే.. `ఛత్రపతి`, `కర్ణన్`. తెలుగులో అఖండ
విజయం సాధించిన `ఛత్రపతి`కి హిందీ వెర్షన్ గా రూపొందనున్న సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సాయిశ్రీనివాస్. ఈ రీమేక్ తో టాలీవుడ్ స్టార్ కెప్టెన్ వీవీ వినాయక్ కూడా బాలీవుడ్ డెబ్యూ
ఇవ్వనుండడం విశేషం. ఇక తాజాగా తమిళనాట ఘనవిజయం సాధించిన `కర్ణన్`ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తాడని టాక్.
కాగా, `ఛత్రపతి` రీమేక్ ఈ పాటికే పట్టాలెక్కాల్సి ఉండగా.. కరోనా ఎఫెక్ట్ తో ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. `కర్ణన్` రీమేక్ ని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడట సాయిశ్రీనివాస్. `కర్ణన్` రీమేక్ పూర్తయ్యేలోపే.. `ఛత్రపతి` రీమేక్ కూడా చిత్రీకరణకి సిద్ధమవుతుందని బజ్. మరి.. ఈ రీమేక్స్ తో ఈ యంగ్ హీరో ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |