![]() |
![]() |

తమిళ స్టార్ హీరో అజిత్ కి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు అజిత్ ఇంటికి ఫోన్ చేసి బాంబు పెట్టినట్టు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన అజిత్ ఇంటికెళ్ళి తనిఖీలు చేసి.. అది ఫేక్ కాల్ అని తేల్చారు.
హీరో అజిత్ భార్యాపిల్లలతో కలిసి తిరువాన్మియూరులో నివాసముంటున్నారు. అయితే వారు ఉంటున్న ఇంట్లో బాంబు పెట్టినట్టు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా.. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇల్లు మొత్తం తనిఖీ చేసి.. ఇంట్లో బాంబు లేదని తేల్చారు. ఎవరో ఆకతాయిలు బాంబు బెదిరింపు కాల్ చేసినట్టుగా గుర్తించారు.
కాగా, తమిళ హీరోలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కొత్త కాదు. గతేడాది కూడా ఇదే సమయంలో స్టార్ హీరోలు రజినీకాంత్, విజయ్, అజిత్ లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఆకతాయిల పనే అని తేల్చారు పోలీసులు.
![]() |
![]() |