![]() |
![]() |

ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపే దర్శకులు అరుదుగా ఉంటారు. అందులో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒకడు. ఇప్పటిదాకా తీసింది మూడు సినిమాలే కానీ.. దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'అ!', 'కల్కి', 'జాంబీరెడ్డి' సినిమాలు దేనికదే ప్రత్యేకం. దీంతో ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా ఎలాంటిది చేస్తాడో అని సినీ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లే తాజాగా మరో విభిన్న సినిమాను ప్రకటించిన ప్రశాంత్ వర్మ ఆ ఆసక్తిని రెట్టింపు చేశాడు.
నేడు(మే 29) ప్రశాంత్ వర్మ పుట్టినరోజున సందర్భంగా.. `హను-మాన్` పేరుతో తెరకెక్కనున్న తన నాలుగో చిత్రాన్ని ప్రకటించాడు. మొట్టమొదటి ఒరిజినల్ సూపర్ హీరో తెలుగు ఫిల్మ్ అని తెలుపుతూ.. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. హనుమంతుడు (హనుమాన్) భారతీయులకు సూపర్ హీరో. దాన్ని బేస్ చేసుకునే 'హను-మాన్' పేరుతో ప్రశాంత్ వర్మ సూపర్ హీరో ఫిల్మ్ చేస్తున్నాడని మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. హాలీవుడ్ లో ఎన్నో సూపర్ హీరో సినిమాలు వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించాయి. మరి ప్రశాంత్ వర్మ తీస్తున్న 'హను-మాన్' ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.
కాగా, 'హను-మాన్' లో స్టార్ హీరో నటించనున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.
![]() |
![]() |