![]() |
![]() |

900 పైచిలుకు చిత్రాల నటుడు చంద్రమోహన్ పుట్టినరోజు మే 23. ఎనభై సంవత్సరాల జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు రెండు రోజుల పాటు జూమ్ ద్వారా మే 22 నుంచి 23 వరకు 24 గంటల సేపు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నిన్న (మే 25న) అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యంపై ఓ చేదు వార్త వాట్సాప్ ద్వారా ప్రచారంలోకి వచ్చింది. దాంతో తాను బాగానే ఉన్నానని స్వయంగా చంద్రమోహన్ ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.
కాగా పుట్టినరోజున చంద్రమోహన్ పేరిట మృత్యుంజయ హోమం జరిగిందనీ, శ్రీమతితో కలిసి ఆయన పాల్గొన్నారనీ వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీ రామరాజు తెలిపారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆయనను శతమానం భవతి అని ఆశీర్వదించారని ఆయన అన్నారు. చంద్రమోహన్‌పై చేదువార్తను ఓ చానల్ ప్రసారం చేసి, తర్వాత ఆపేసిందనీ, అదే రోజు చంద్రమోహన్‌కు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఫోన్ చేశారనీ, ఆ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారనీ తాజాగా తన ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.
వంశీ రామరాజు ఫేస్‌బుక్ పోస్ట్ యథాతథంగా...
"వేగేశ్న పౌండేషన్ ఆశ్రమంలో నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో 23వ తేదీ ఉదయం వేగేశ్న ఫౌండేషన్ చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి నేతృత్వంలో ఆన్లైన్లో శ్రీ చంద్రమోహన్ గారి పేర మృత్యుంజయ హోమం జరిగింది.. వారు వారి శ్రీమతి ఆన్లైన్లో పాల్గొన్నారు..25వ తేది పుకారు వచ్చింది.. ఒక టీవీ ఛానల్ చెడు వార్త ప్రసారం చేశారు.. నాకు ఫోన్ కాల్ వచ్చింది.. "ఇది తెలుసా" అని అలా వీలు లేదు.. అలా జరగదు.. ఎందుకంటే వారిని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు ఆశీర్వదించారు.. స్వామివారి ఆశీర్వాదం మామూలు విషయం కాదు.. మిత్రుడు చెప్పిన ఛానల్ పెట్టాను..వార్త రాలేదు.. మిత్రుడిని అడిగాను వార్త రాలేదు అని.. "అవును ఆపేసినట్టున్నారు.." అన్నాడు..
22, 23 తేదీల్లో 24 గంటలు 108 మంది రచయితలు చంద్రమోహన్ గారి 108 సినిమాల మీద ప్రసంగం చేశారు.. వంశీ గ్లోబల్ అవార్డ్స్, సంతోషం, శారద ఆకునూరి నిర్వహించారు..
ఎందుకైనా మంచిదని జలంధర చంద్రమోహన్ కి ఫోన్ చేశాను.. "సంతోషంగా ఉన్నారు.. ఇప్పుడే దృష్టి తీసాను.. ఇప్పుడే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేశారు.చాలా సేపు ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు.. మీరు మాట్లాడండి.." అంటూ ఫోన్ చంద్ర మోహన్ గారికి ఇచ్చారు.. చాలాసేపు ఆనందాన్ని పంచుకున్నాము...హమ్మయ్య అనుకున్నా.. సమయం గడిచినకొద్దీ చేదువార్త దేశవిదేశాలకు వెళ్ళింది.. వెంటనే చంద్ర మోహన్ గారు వీడియోలో ప్రసంగించారు..
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు వారిని శతమానం భవతి అని ఆశీర్వదించారు..
వంశీ రామరాజు
శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారి సేవకుడు"
![]() |
![]() |