![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ విజయ్ కి అచ్చొచ్చిన కథానాయికల్లో కేరళకుట్టి కీర్తి సురేశ్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `భైరవ` (2017) (తెలుగులో `ఏజెంట్ భైరవ` పేరుతో అనువాదమైంది), `సర్కార్` (2018) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే.. మూడేళ్ళ విరామం అనంతరం ఈ ఇద్దరు ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. విజయ్ కథానాయకుడిగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించనున్నారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. కాగా, ఈ చిత్రంలోనే విజయ్ కి జంటగా కీర్తి సురేశ్ నటించబోతోందని బజ్. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలోనే.. యూనిట్ ఆమె వైపు మొగ్గు చూపిస్తోందని టాక్. త్వరలోనే విజయ్, కీర్తి థర్డ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానున్నది. మరి.. ఈ ద్విభాషా చిత్రంతో విజయ్, కీర్తి హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |