![]() |
![]() |

హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో టామ్ క్రూజ్ తో కలసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు టాక్ వినిపించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తాజాగా డైరెక్టర్ క్రిస్టోఫర్ తేల్చి చెప్పారు.
ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ వార్తల నేపథ్యంలో.. ఓ నెటిజన్ డైరెక్టర్ క్రిస్టోఫర్ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వమని కోరాడు. ''మిషన్ ఇంపాజిబుల్ 7 లో కీలక పాత్ర కోసం ప్రభాస్ ని తీసుకున్నారనే వార్త ఇండియన్ న్యూస్ చానెల్స్ లో ట్రెండింగ్ అవుతోంది. దయచేసి ఇది నిజమో కాదో కన్ఫర్మ్ చేయగలరా?'' అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన డైరెక్టర్ క్రిస్టోఫర్ ఆ వార్తలో నిజం లేదని చెప్పారు. ప్రభాస్ చాలా టాలెంటెడ్ మ్యాన్ అని, అయితే తాము ఎప్పుడూ కలవలేదని క్రిస్టోఫర్ ట్వీట్ చేశారు.
ప్రభాస్ హాలీవుడ్ సినిమాలో నటించడం లేదని తేలడం ఫ్యాన్స్ కి కాస్త నిరుత్సాహం కలిగించే విషయమే. అయితే, ఓ హాలీవుడ్ డైరెక్టర్.. ప్రభాస్ ని టాలెంటెడ్ మ్యాన్ అని కాంప్లిమెంట్ ఇవ్వడం ఆనందించాల్సిన విషయమనే చెప్పాలి.
![]() |
![]() |