![]() |
![]() |

నటి రాధిక 58 ఏళ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా, మంచి ఫిట్‌నెస్‌తో, చెక్కు చెదరని అందంతో కనిపిస్తుంటారు. ఆమె వర్కవుట్స్ చేస్తున్న ఓ వీడియో ఒకటి బయటకు వచ్చి, అనేకమందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లోని టాప్ యాక్టర్ల సరసన నాయికగా ఆమె నటించారు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి హీరోలతోనూ, తమిళంలో రజనీకాంత్, కమల్‌హాసన్, విజయకాంత్, సత్యరాజ్ లాంటి హీరోలతోనూ ఆమె నటించారు. ముఖ్యంగా చిరంజీవి-రాధిక హిట్ పెయిర్‌గా పలు సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించారు.
జోవియల్ క్యారెక్టర్‌ను ఎంత ఈజ్‌తో చేస్తారో, ఎమోషనల్ క్యారెక్టర్‌ను అంత నాచురల్‌గా పోషిస్తారనే పేరును ఆమె సంపాదించుకున్నారు. 1980లలో, 90ల మొదట్లో తెలుగు, తమిళ రంగాల్లో అగ్రనటిగా వెలిగారు రాధిక. ఆ తర్వాత టీవీ రంగంలోనూ అడుగుపెట్టి అనేక సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించి, అక్కడా రాణించారు. రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఆమె నిర్మించిన సీరియల్స్ అన్నీ వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 'పిన్ని' సీరియల్‌ను ఆడవాళ్లతో పాటు మగవాళ్లు కూడా బాగా ఆదరించారు. 2001లో సహ నటుడు శరత్‌కుమార్‌ను ఆమె పెళ్లాడారు. ఆమెకది మూడో వివాహం. ఇటీవలే ఆ జంట తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
ఇటీవల తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె, శరత్‌కుమార్ ఎలాంటి వర్కవుట్స్ చేస్తారో ఆమె చూపించారు. ఆమె 58 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండటం వెనుక సీక్రెట్ ఇదేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |