![]() |
![]() |

తన కెరీర్ మొత్తమ్మీద ఒకే ఒక చిత్రం కోసం ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో ఆన్-స్క్రీన్ రొమాన్స్ చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ సినిమానే.. `బ్రహ్మోత్సవం`(2016). ఇందులో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు. కట్ చేస్తే.. ఐదేళ్ళ తరువాత మరోసారి ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో కొత్త చిత్రం కోసం సందడి చేయనున్నారట ఈ ఘట్టమనేని వారి హ్యాండ్సమ్ హీరో.
ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు మరో చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలకు స్థానముందట. ఆ పాత్రల్లో `బుట్టబొమ్మ` పూజా హెగ్డే, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, కేరళకుట్టి నివేదా థామస్ దర్శనమివ్వనున్నారని టాక్. అంతేకాదు.. ముగ్గురికి కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే దక్కాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశముంది.
`#SSMB 28` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.
![]() |
![]() |