![]() |
![]() |

యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో సింహభాగం విజయం సాధించాయి. వాటిలో హోమ్ బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన `రారండోయ్.. వేడుక చూద్దాం` ఒకటి. `సోగ్గాడే చిన్ని నాయనా` వంటి విజయవంతమైన చిత్రం తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా అదే బాట పట్టింది. చైతూకి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సంపత్ రాజ్, కౌసల్య, ప్రియ, వెన్నెల కిశోర్, అన్నపూర్ణ, చలపతిరావు, అనితా చౌదరి, పోసాని కృష్ణమురళి, సురేఖా వాణి, రఘుబాబు, సప్తగిరి, మధునందన్, హైపర్ ఆది తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి సాహిత్యమందించారు. ``రారండోయ్ వేడుక చూద్దాం``, ``భ్రమరాంబ``, ``నీవెంటే నేనుంటే``, ``తకిట తకఝుమ్``, ``బ్రేక్ అప్``.. ఇలా ఇందులోని పాటలన్నీ కూడా ఆదరణ పొందాయి. 2017 మే 26న విడుదలై మంచి విజయం సాధించిన `రారండోయ్.. వేడుక చూద్దాం`.. నేటితో 4 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |