![]() |
![]() |

మాస్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ప్రస్తుతం `అఖండ`తో బిజీగా ఉన్నారు. తన లక్కీ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణతో.. `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత బోయపాటి చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమ వర్గాల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. మే 28న విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. విజయదశమి కానుకగా `అఖండ`ని థియేటర్స్ లోకి తీసుకొచ్చే అవకాశముందంటున్నారు.
ఇదిలా ఉంటే.. `అఖండ` తరువాత బోయపాటి తన నెక్స్ట్ వెంచర్ ని తన ఫస్ట్ ఫిల్మ్ (భద్ర) హీరో అయిన మాస్ మహారాజా రవితేజతో గానీ, `సరైనోడు` స్టార్ అల్లు అర్జున్ తోగానీ చేయబోతున్నట్లు కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఆయా స్టార్స్ మరో ఏడాదికి పైగా వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండనుండడంతో.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తన తదుపరి సినిమా చేసే దిశగా బోయపాటి ప్రణాళిక రచిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రామ్ చేతిలో ఓ బైలింగ్వల్ మూవీ మాత్రమే ఉంది. లింగుస్వామి డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి నాయికగా నటించనుంది.
మరి.. కొన్నాళ్ళుగా వార్తల్లో ఉన్న బోయపాటి, రామ్ కాంబో.. ఎట్టకేలకు సెట్ అవుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |