![]() |
![]() |

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన 'అనుకోని అతిథి' చిత్ర నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ నేటి (మే 26) ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన పబ్లిసిస్టులు తెలిపారు. సాయిపల్లవి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అథిరన్'. మలయాళంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొంది 2019లో విడుదలైన ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథనంతో నడిచే ఈ సినిమాకు సాయిపల్లవి నటన హైలైట్‌గా నిలిచింది.
ఆ మూవీని కృష్ణకుమార్ 'అనుకోని అతిథి' పేరుతో తెలుగులో అనువాదం చేశారు. అప్పుడే ఆ సినిమా విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తి దెబ్బకు విడుదలకు నోచుకోలేకపోయింది. దాంతో ఆ మూవీని ఆయన ఆహా ఓటీటీకి అమ్మేశారు. మే 28న ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఇంతలోనే కృష్ణకుమార్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతిచెందడం విషాదకరం.
![]() |
![]() |