![]() |
![]() |

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రతాపాన్ని చూపుతోంది. కరోనా కాటుకు ఎంతోమంది ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ జై శ్రీనివాస్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘జై’ సినిమాలోని ‘దేశం మనదే.. తేజం మనదే...’ పాటతో ఆయన ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి 'జై శ్రీనివాస్' గా మారిపోయారు.
టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సిమాలకు జై శ్రీనివాస్ పాటలు పాడారు. ప్రైవేట్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లకు కూడా పాటలు పాడారు. దాదాపు 200కి పైగా పాటలు పాడారు. జై శ్రీనివాస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
సింగర్ జై శ్రీనివాస్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
![]() |
![]() |