![]() |
![]() |
.jpg)
ఆయుర్వేద మందుతో కరోనా వైద్యం చేస్తున్న కృష్ణపట్నం ఆనందయ్యకు అన్నివైపులా మద్దతు పెరుగుతోంది. ఆ మందువల్ల నష్టం లేనప్పుడు ఎందుకు అడ్డుకోవాలంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆనందయ్య టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. అల్లోపతి వైద్యం తీసుకుంటున్నా పలువురు మృత్యువాత పడుతున్నారు. మందులు వాడిన వారికి అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆనందయ్య మందును అడ్డుకోవడం న్యాయమా అని చర్చిస్తున్నారు. సంగీత దర్శకుడు రఘు కుంచె సైతం తన ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా ఆయనకు మద్దతు తెలిపారు.
"ప్రాణాన్ని నిలబెట్టేది ఆయుర్వేదం అయినా, అలోపతి అయినా, హోమియోపతి అయినా.. ఈ సమయంలో దేనివల్ల ఉపకారం జరిగినా అది మహాద్భుతమే. "ఒక్క పైసా" కూడా తీసుకోకుండా తను సృష్టించిన ఔషధ రూపంలో మనుషుల గుండెల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచుతున్న
నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం "ఆనందయ్య గారికి" మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సమయంలో ఇది చాలా మందికి మింగుడు పడకపోవచ్చు.. ఎందుకంటే ఫ్రీగా మందు ఇచ్చి వేరే వాళ్ళ పొట్ట కొడుతుతున్నాడీయన. ఇక వాదోపవాదాలకీ, తర్క వితర్కాలకీ బోలెడు stuff దొరికింది. కానీ.. సముద్రంలో మునిగిపోయేవాళ్ళకి చిన్న చెక్క దొరికినా అది బ్రతుకు మీద కొండంత ఆశని నింపుద్ది... అంతే కానీ Tv debates మీరు పెట్టే సోది వల్ల కాదు. నమ్మకం కన్నా గొప్ప బలం మరొకటి లేదు." అంటూ రాసుకొచ్చారు రఘు కుంచె.
దాంతో పాటు ఆయన ఒక సూచన కూడా చేశారు. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళేటపుడు జాగ్రత్తలు తీసుకోండి.. "భౌతిక దూరాన్ని, క్రమ శిక్షణని పాటించండి దయచేసి. మీ ఆత్రుతకి, కంగారుకి మళ్ళీ మీరే బాధితులు కాకండి." అని చెప్పారు.
![]() |
![]() |