Home  »  News  »  బ‌ర్త్‌డే బాయ్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు పోటెత్తిన విషెస్‌

Updated : May 20, 2021

 

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గురువారం అనేక‌మంది స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు, సెల‌బ్రిటీలు, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో అయితే విషెస్ పోటెత్తాయి. తార‌క్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్నారు. ఆ మూవీలో తార‌క్ పోషిస్తోన్న కొమ‌రం భీమ్ క్యారెక్ట‌ర్ ఇంటెన్స్ లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు.

సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌ర్ వెంక‌టేశ్ త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా తార‌క్‌తో క‌లిసున్న ఫొటోను షేర్ చేసి, "Happy birthday dear @tarak9999 . ఈ సంవ‌త్స‌ర‌మంతా నీకు ఆనందంతో, మంచి ఆరోగ్యంతో నిండిపోవాలి." అంటూ ట్వీట్ చేశారు.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, "Happy birthday @tarak9999 . ఎప్ప‌టిలా నీకు ఆనందం స‌మృద్ధిగా ల‌భించాల‌ని ఆకాంక్షిస్తున్నాను. Take care brother!" అని ట్వీట్ చేయ‌డంతో పాటు తార‌క్‌తో క‌లిసున్న ఫొటోను షేర్ చేశారు.

'ఆర్ఆర్ఆర్' మూవీలో తార‌క్‌తో క‌లిసి న‌టిస్తోన్న రామ్‌చ‌ర‌ణ్‌, ఆ సినిమాలో తార‌క్ ఇంటెన్స్ లుక్ పోస్ట‌ర్‌ను షేర్ చేసి, "Meet my dearest 
@tarak9999 as the mighty and intense #KomaramBheem from #RRRMovie. He's a rebel with a cause! Happy Birthday Brother" అని రాసుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్, "తార‌క్‌ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ ట్వీట్ చేశారు.

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో, "ఈ జ‌న‌రేష‌న్‌లోని ఫైనెస్ట్ ఆల్‌రౌండ‌ర్స్‌లో ఒక‌రు, ప‌వ‌ర్‌హౌస్ ఆఫ్ టాలెంట్ అయిన యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీరు త్వ‌ర‌గా రిక‌వ‌ర్ అవ్వాల‌ని ప్రార్థిస్తున్నా. #HappyBirthdayNTR" అని రాసుకొచ్చారు.

త్వ‌ర‌లో తార‌క్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్న 'కేజీఎఫ్' ఫేమ్‌ ప్ర‌శాంత్ నీల్ ఆయ‌న‌తో క‌లిసున్న ఓ ఫొటోను షేర్ చేసి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. "గుర్తుంచుకోద‌గ్గ ఒకే ఒక్క నేల ర‌క్తంలో మునిగిన నేల‌ మాత్ర‌మే. దాన్ని ఒకే ఒక్క శ‌క్తి తార‌క్‌తో తీయ‌డానికి ఎదురుచూస్తున్నాను. అది #NTR31. Wishing you a safe birthday brother" అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

నాన్న‌కు ప్రేమ‌తో మూవీలో తార‌క్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, "Happy birthday @tarak9999 . have the most amazing most happy and healthy year ! Keep killing it" అని విష్ చేసింది.
 
మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ "Wish U a SUPER DUPER HAPPY MUSICAL BIRTHDAY Dearest Brother @tarak9999 . అమిత‌మైన ఎన‌ర్జీతో ఎప్ప‌టిలా రచ్చ చేస్తూనే ఉండాలి. నీ బ్రిలియంట్ టాలెంట్‌తో మ‌మ్మ‌ల్నెప్పుడూ ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉండాలి." అని విష్ చేశారు.

టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ 'అర‌వింద స‌మేత' సినిమాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేసి, "#HappyBirthdayNTR love U anna thanks for this Dear anna #AravindaSametha & #Trivikram gaaru This will never get old" అని ట్వీట్ చేశారు.

కొద్ది రోజుల క్రితం కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం స్వీయ ఐసోలేష‌న్‌లో ఉంటూ, డాక్ట‌ర్ల సూచ‌న‌లు పాటిస్తున్నారు. త‌న ఆరోగ్యం గురించి వ‌ర్రీ అవ్వాల్సిన ప‌నిలేద‌నీ, తాను బాగానే ఉన్నాన‌ని ఇటీవ‌ల తార‌క్ తెలిపారు. త‌ను త్వ‌ర‌లో కోలుకొని సంపూర్ణారోగ్యంతో తిరిగొస్తాన‌ని చెప్పారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.