![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నేడు(మే 20) తారక్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ తో సినిమాను అధికారికంగా ప్రకటించారు. రక్తంతో తడిసిన నేలని మాత్రమే గుర్తుంచుకోవాలి.. ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ ప్రశాంత్ నీల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ఉంటుందా లేదా అని సందిగ్ధత నెలకొన్న సమయంలో అధికారిక ప్రకటన రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో 'సలార్' తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు తారక్ కూడా 'ఆర్ఆర్ఆర్', కొరటాల శివ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ కాంబినేషన్ మూవీ ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల కానుంది.
![]() |
![]() |