![]() |
![]() |
.jpg)
`ఉప్పెన`తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. తనదైన నటనతో యువతరాన్ని అలరించాడు వైష్ణవ్. అలాగే, తనకంటూ ఓ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. వైష్ణవ్ సెకండ్ వెంచర్ పైనే అందరి దృష్టి ఉంది. మొదటి సినిమాని డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేసిన వైష్ణవ్.. సెకండ్ ఫిల్మ్ కోసం స్టార్ కెప్టెన్ క్రిష్ తో జట్టుకట్టాడు.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ప్రసిద్ధ నవల `కొండపొలం` ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్.. కొద్ది నెలల క్రితమే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, వైష్ణవ్ - క్రిష్ కాంబో మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారని కొన్నాళ్ళుగా ప్రచారం సాగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. బిగ్ స్క్రీన్ రిలీజ్ గానే ఈ సినిమా ఉంటుందట. మరికొద్ది రోజుల్లో.. టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారని టాక్.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు.
![]() |
![]() |