![]() |
![]() |

ఇటీవల `లైవ్ టెలికాస్ట్` అనే ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అందులో భయపెట్టే పాత్రలో కాకుండా.. భయపడే పాత్రలో దర్శనమిచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఓ హారర్ మూవీలో నటిస్తోంది కాజల్. ఇందులో అతీంద్రియ శక్తులు ఉన్న యువతిగా కనిపించబోతోందట. అయితే.. తనలో సూపర్ పవర్ ఉన్నప్పటికీ.. దాన్ని గ్రహించలేని పాత్ర అదని సమాచారం. ఈ నేపథ్యంలో.. తనకు ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులేంటి? అనేదే ఈ చిత్ర కథాంశం.
అంతేకాదు.. కాజల్ తో పాటు రెజీనా, జననీ అయ్యర్, రైజా విల్సన్, ఇరానియన్ నటి నోయరికా ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు కథానాయికల చుట్టూ తిరిగే ఈ కథలో కాజల్ దే మెయిన్ రోల్. డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ డిఫరెంట్ హారర్ మూవీ త్వరలోనే జనం ముందుకు రానుంది.
కాగా.. గతంలో కాజల్, రెజీనా `అ!` చిత్రంలో నటించారు. అయితే, ఆ సినిమాలో ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవు. మరి.. ఈ హారర్ మూవీలోనైనా స్క్రీన్ షేర్ చేసుకుంటారేమో చూడాలి. అన్నట్లు.. కాజల్ నాయికగా నటించిన మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య`లోనూ రెజీనా ఓ ప్రత్యేక గీతంలో చిందులేసింది.
![]() |
![]() |