![]() |
![]() |

`ఆటో జానీ`.. 30 ఏళ్ళ క్రితం నాటి `రౌడీ అల్లుడు` (1991) చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పోషించిన ఊరమాస్ క్యారెక్టర్ ఇది. అచ్చంగా ఆ పేరుతోనే.. చిరు రి-ఎంట్రీ మూవీ కోసం ఐదేళ్ళ క్రితం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ కథ సిద్ధం చేశారు. ఫస్టాఫ్ కి మెగాస్టార్ మంచి స్కోర్ ఇచ్చినా.. సెకండాఫ్ మాత్రం నెంబరాఫ్ టైమ్స్ రిజెక్ట్ అయింది. దీంతో.. `ఆటో జానీ` కథ అటకకెక్కింది.
కట్ చేస్తే.. త్వరలోనే `ఆటో జానీ` వెలుగులోకి రానున్నాడట. కాకపోతే.. ఈ సారి మెగాస్టార్ కాకుండా మాస్ మహారాజా రవితేజ ఆ పాత్రలో నటించబోతున్నారని బజ్. ప్రస్తుతం ఈ మేరకు పూరి, రవితేజ మధ్య చర్చలు సాగుతున్నాయని.. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది `ఆటో జానీ` సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని వినికిడి. ప్రస్తుతం అటు రవితేజ, ఇటు పూరి వేర్వేరు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. అవన్నీ పూర్తయ్యాకే `ఆటో జానీ` పట్టాలెక్కుతుంది. `ఖిలాడి`తో పాటు త్రినాథరావ్ నక్కిన, శరత్ మండవ డైరెక్టోరియల్స్ తో రవితేజ బిజీగా ఉంటే.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `లైగర్` పనిలో తలమునకలై ఉన్నారు జగన్.
మరి.. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `ఇడియట్`, `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`తో హ్యాట్రిక్ హిట్స్ చూసి.. `నేనింతే`, `దేవుడు చేసిన మనుషులు`తో ట్రాక్ తప్పిన రవితేజ - పూరి కాంబో.. `ఆటో జానీ`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
![]() |
![]() |