![]() |
![]() |

టాలీవుడ్‌లో స్టార్ హీరో అయిన ప్రభాస్.. రాజమౌళి దర్శకత్వంలో నటించిన 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్‌తో పని చేసిన ప్రతి ఒక్కరూ ఆయన గురించి గొప్పగా చెబుతుంటారు. "ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటారు. ఎంత క్రేజ్ ఉన్నా.. ఒదిగి ఉండే తత్వం ఆయనది".. ఇలా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి డబ్బింగ్ ఆర్టిస్ట్, సీరియల్ నటుడు ఆదిత్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
'బాహుబలి' సినిమాలో ఆదిత్య రాజగురువుగా నటించాడు. కాలకేయుడితో యుద్ధానికి వెళ్లే సమయంలో జంతువును బలిచ్చే సన్నివేశంలో "యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది. పెనుముప్పు తప్పదు యువరాజా" అనే డైలాగ్ ఆదిత్య చెప్పాల్సివుంది. అయితే ఆ సమయంలో అతను డైలాగ్ చాలా గట్టిగా చెప్పడంతో.. ప్రభాస్ తన దగ్గరకు వచ్చి "డార్లింగ్ ఏం అనుకోకు.. డైలాగ్ కొంచెం మెల్లగా చెప్పవా.. నా డైలాగ్ మర్చిపోతున్నాను." అన్నారట. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ తన లైఫ్ లో మర్చిపోలేనని ఆదిత్య చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని.. ఆయన లాంటి మనసున్న హీరోను ఇప్పటివరకు చూడలేదని ఆదిత్య అన్నాడు. సెట్ లో అందరితో ఆయన సరదాగా ఉంటారని.. తనతో పని చేసే అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తారని తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
![]() |
![]() |