![]() |
![]() |
.jpg)
పాపులర్ తెలుగు సింగర్ మంగ్లీ ఓ కన్నడ సినిమా ద్వారా శాండల్‌వుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. సీనియర్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ 124వ సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి జరగనున్నది. ఇటీవల విడుదలైన 'రాబర్ట్' మూవీ తెలుగు వెర్షన్‌లో "కన్నె అదిరింది" పాటతో మంగ్లీ ఆకట్టుకున్నారు.
కొద్ది రోజుల క్రితం ఆమె ఒక ఎన్నికల ప్రచారం కోసం నార్త్ కర్ణాటకలో పర్యటించారు. అప్పుడు ఆమెతో సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు. ఆ ప్రచారంలో భాగంగా "కన్నె అదిరింది" పాటను పాడి జనాన్ని అలరించారు మంగ్లీ. సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏమిటనేది టీమ్ వెల్లడించలేదు.
ఈ మూవీలో ఇంతదాకా కనిపించని రోల్‌లో శివ రాజ్‌కుమార్ కనిపించనున్నాడని వినిపిస్తోంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందే ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్‌లకూ ప్రాధాన్యం ఉంటుంది. కశ్మీర్, చిక్‌మంగళూరు లాంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు. హీరోయిన్ కోసం టీమ్ అన్వేషిస్తోంది. రామ్ ధూళిపూడి ఈ సినిమాకి దర్శకుడు.
.jpg)
తెలంగాణ ఫోక్ సింగర్‌గా లైమ్‌లైట్‌లోకి వచ్చిన మంగ్లీ సినీ గాయనిగానూ రాణిస్తూ వస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమా 'లవ్ స్టోరి'లో ఆమె పాడిన "సారంగ దరియా" సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. యూ ట్యూబ్‌లో ఆ పాటకు ఇంతదాకా 160 మిలియన్ వ్యూస్ దాకా వచ్చాయి. అతి తక్కువ కాలంలో ఇన్ని వ్యూస్ సాధించిన తెలుగు వీడియో లిరికల్ సాంగ్ ఇదే. ఇక నటిగానూ మంగ్లీ "గోరె జీవన్" సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్.
.jpg)
![]() |
![]() |